తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత..! 1 d ago
TG : శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికి తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సంవత్సరం పండుగ ప్రారంభంలోనే చలి తీవ్రత అధికంగా మారింది. నేడు తెలంగాణలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇందులో మరీ ముఖ్యంగా మెదక్ జిల్లాలో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మహానగరం హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై దూరప్రాంతాలకు డ్యూటీ కి వెళ్లే వారు.. బైకులను వదిలి మెట్రో బాట పడుతున్నారు. చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు అలర్ట్ జారీ చేస్తున్నారు. వయస్సు మీదపడిన వారు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు రాకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.